AP News: ముగ్గురు విద్యార్థినుల కిడ్నాప్‌నకు యత్నం.. దుండగుల నిర్బంధం 
eenadu telugu news
Updated : 16/09/2021 13:34 IST

AP News: ముగ్గురు విద్యార్థినుల కిడ్నాప్‌నకు యత్నం.. దుండగుల నిర్బంధం 

మెరకముడిదాం: ముగ్గురు పాఠశాల విద్యార్థినులను దుండగులు కిడ్నాప్‌నకు యత్నించిన ఘటన విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో చోటు చేసుకుంది. ఊటపల్లి నుంచి మెరకముడిదాంలోని ఉన్నత పాఠశాలకు సైకిల్‌పై వెళ్తున్న విద్యార్థులను గుర్తు తెలియని వ్యక్తులు ట్రైసైకిల్‌లో ఎక్కిస్తుండగా అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించారు. దీంతో దుండగులు పారిపోవడానికి ప్రయత్నించారు. వాహనదారులు సమాచారం ఇవ్వడంతో ఆ వ్యక్తులను గ్రామస్థులకు నిర్బంధించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కిడ్నాప్‌నకు యత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని