నేడు జడ్పీ అధ్యక్ష ఎన్నికలు
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

నేడు జడ్పీ అధ్యక్ష ఎన్నికలు


ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ సూర్యకుమారి తదితరులు

విజయనగరం అర్బన్, న్యూస్‌టుడే: జిల్లా పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్షుల ఎన్నిక శనివారం నిర్వహించనున్నారు. జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు సాగనుంది. చేతులెత్తే విధానంలో ఇద్దరు కో-ఆప్షన్‌ సభ్యులను జడ్పీటీసీ సభ్యులు ఎన్నుకోనున్నారు. ప్రిసైడింగ్‌ అధికారిగా కలెక్టర్‌ వ్యవహరిస్తారు. ముందుగా కో-ఆప్షన్‌ సభ్యులుగా మైనార్టీ కేటగిరీకి చెందిన వారిని ఎన్నుకుంటారు. ఒంటిగంటకు జరిగే ప్రత్యేక సమావేశంలో జడ్పీటీసీలు, కో-ఆప్షన్‌ సభ్యుల ప్రమాణ స్వీకారం, ఎన్నిక జరుగుతుంది. అనంతరం 3 గంటలకు నూతన పాలకవర్గం సమావేశమవుతుంది. మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను ఆహ్వానించినట్లు జడ్పీ సీఈవో వి.వెంకటేశ్వరరావు తెలిపారు.
వైకాపాకే పట్టం..: జడ్పీ పీఠాన్ని వైకాపా దక్కించుకోనుంది. ఇప్పటివరకు నాలుగు సార్లు తెదేపా, మూడు సార్లు కాంగ్రెస్‌ పీఠాన్ని చేజిక్కించుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో 34 జడ్పీటీసీ స్థానాలు వైకాపాకే దక్కాయి. మెరకముడిదాం జడ్పీటీసీ సభ్యుడు మజ్జి శ్రీనివాసరావును పార్టీ ఇది వరకే ఛైర్మన్‌గా ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారిగా ఇద్దరు వైస్‌ఛైర్మన్లను నియమిస్తున్నారు. ఈ పదవులు పార్వతీపురం డివిజన్‌ వారికి కేటాయించినట్లు తెలుస్తోంది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని