పూర్ణపాడు- లాబేసు వంతెనకు మోక్షం
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

పూర్ణపాడు- లాబేసు వంతెనకు మోక్షం

 పార్వతీపురం, కొమరాడ, న్యూస్‌టుడే: నాగావళిపై కొమరాడ మండలం పూర్ణపాడు-లాబేసు మధ్య వంతెన నిర్మాణం, ఇతరపనులకు నిధులు మంజూరయ్యాయి. గతంలో వివిధ పథకాల కింద రూ.10 కోట్లు మంజూరు చేస్తే రూ.7 కోట్లు ఖర్చు చేశారు. ఖర్చు చేయని రూ.3 కోట్లు వెనక్కి వెళ్లిపోయాయి. పనుల పూర్తికి మరో రూ.4 కోట్లు కావాలని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. మురిగిపోయిన రూ.3 కోట్లు, కొత్తగా ప్రతిపాదించిన రూ.నాలుగు కోట్లు వెరసి రూ.ఏడు కోట్లను మంజూరుచేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది దీంతో పనులు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. వంతెన పనులు పూర్తి చేయడానికి కొత్తగా మంజూరైన నిధులు సరిపోతాయని పీˆఆర్‌ఐయూ పార్వతీపురం సబ్‌ డివిజన్‌ ఉప కార్యనిర్వాహక ఇంజినీరు రామమోహనరావు ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. కొత్తగా మంజూరైన రూ.నాలుగు కోట్లతో వంతెన నిర్మాణ వ్యయం రూ.14 కోట్లకు చేరిందన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని