సోదరిపై అన్న అత్యాచారం
eenadu telugu news
Updated : 25/09/2021 11:34 IST

సోదరిపై అన్న అత్యాచారం

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నే కామాంధుడిగా మారాడు. సోదరిపై కన్నేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన డెంకాడ మండలంలో చోటు చేసుకుంది. ఆరునెలల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. బాధితులు, పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(16) పదో తరగతి చదువుతోంది. ఆమెతో పెదనాన్న కుమారుడు ఆప్యాయంగా ఉండేవాడు. రోజూ సరదాగా మాట్లాడేవాడు. ఆరు నెలల క్రితం ఎవరూ లేని సమయంలో బాలికను ప్రేమగా పిలిచి, నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో, ఫొటోలు తీశానని, విషయం బయటకు చెబితే సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు ఎవరికీ చెప్పలేదు. మూడు నెలల క్రితం బాలికకు అనారోగ్యంగా ఉండడంతో ఓ సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. ఆమె మూడు నెలల గర్భవతి అని, అప్పటికే గర్భస్రావమైందని వైద్యులు చెప్పడంతో బోరుమని విలపించారు. పరువు పోతుందని, ఎవరికీ చెప్పొద్దని బంధువులు, ఇతర కుటుంబ సభ్యులు వారికి సూచించారు. దీంతో ఇంతకాలం మౌనంగా ఉండిపోయారు. తల్లిదండ్రులు మాత్రం భరించలేక శుక్రవారం డెంకాడ ఎస్సై పద్మావతిని ఆశ్రయించారు. ఆమె దిశ డీఎస్పీ టి.త్రినాథ్‌కు సమాచారం అందించారు. ఆయన వెంటనే బాధితులను విచారించి, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని