మధుమేహంపై అవగాహన అవసరం: జేసీ
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

మధుమేహంపై అవగాహన అవసరం: జేసీ


గోడప్రతులను ఆవిష్కరిస్తున్న వెంకటరావు, రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు, సభ్యులు

బొబ్బిలి, న్యూస్‌టుడే: మధుమేహంపై అవగాహన అవసరమని జిల్లా సంయుక్త కలెక్టర్‌ వెంకటరావు అన్నారు. రోటరీ ఆధ్వర్యంలో ‘డిఫీట్‌ డయాబెటిస్‌ క్యాంపెయిన్‌’ పేరుతో గోడప్రతుల ఆవిష్కరణ కార్యక్రమం బొబ్బిలి పుర కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జేసీ మాట్లాడుతూ మధుమేహంపై అవగాహన ఉంటే సులువుగా నయమవుతుందన్నారు. ఈనెల 29న నిర్వహించే వైద్య పరీక్షలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుర కమిషనర్‌ ఎస్‌.శ్రీనివాసరావు, రోటరీ అధ్యక్ష, కార్యదర్శులు తూముల కార్తీక్‌, జేసీ రాజు, రీజనల్‌ ఛైర్మన్‌ చంద్రకిశోర్‌, సభ్యులు శ్రీహరి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ‘వన్‌ నేషన్‌- వన్‌ మిలియన్‌ టెస్టు’ పేరుతో పిలిచే ఈ కార్యక్రమం 29న జరుగుతుందన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని