చోరీ కేసులో నలుగురి అరెస్టు
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

చోరీ కేసులో నలుగురి అరెస్టు

రూ.3 లక్షల నగదు, సామగ్రి స్వాధీనం


వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ సుభాష్‌

పార్వతీపురం,పట్టణం, న్యూస్‌టుడే: పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఇటీవల జరిగిన చోరీ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ సుభాష్‌ శుక్రవారం తెలిపారు. ఆయన వివరాల మేరకు.. ఇటీవల పార్వతీపురం మండలం తాళ్లబురిడి సమీపంలోని ఓ దుకాణంలో జరిగిన చోరీలో భాగంగా దర్యాప్తు చేయగా.. పార్వతీపురం సమీపంలోని బార్‌ వద్ద నలుగురి అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించామన్నారు. వారి నుంచి రూ.3 లక్షల నగదు, నాలుగు బ్యాటరీలు, ఇన్వెర్టరు, టీవీ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరిలో సీతానగరం మండలం అప్పయ్యపేటకు చెందిన ముగ్గురు, హైదరాబాద్‌కు చెందిన ఒకరిని గుర్తించామన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన అధికారులు, సిబ్బందిని డీఎస్పీ అభినందించి, ప్రోత్సాహక నగదు అందజేశారు. సీఐ విజయానంద్‌, రూరల్‌ ఎస్‌ఐ వీరబాబు, సిబ్బంది ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని