26 ఏళ్ల తర్వాత మరోసారి ఎంపీపీ పదవి
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

26 ఏళ్ల తర్వాత మరోసారి ఎంపీపీ పదవి


ఉమాలక్ష్మి

తెర్లాం, న్యూస్‌టుడే: బొబ్బిలి నియోజకవర్గం తెర్లాం మండల పరిషత్తు అధ్యక్షురాలిగా నర్సుపల్లి ఉమాలక్ష్మి 26 ఏళ్ల తర్వాత మరోసారి ఎన్నికయ్యారు. రాష్ట్రంలో ఎంపీటీసీల వ్యవస్థ ఏర్పాటైన తర్వాత 1995లో తొలి ఎన్నికల్లో తెర్లాం ఎంపీటీసీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున ఉమాలక్ష్మి పోటీ చేసి విజయం సాధించారు. మండలాధ్యక్షురాలిగా ఎన్నికై ఐదేళ్లపాటు పరిపాలించారు. మండలంలో కీలకమైన నాయకునిగా ఉన్న ఈమె భర్త నర్సుపల్లి బాబ్జీరావు తెర్లాం మేజరు పంచాయతీ సర్పంచిగా, పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం వైకాపా మహిళాధ్యక్షురాలిగా లక్ష్మి ఉన్నారు. ఈ ఎన్నికల్లో తెర్లాం ఎస్సీకి రిజర్వు కావడంతో ఉమాలక్ష్మి విజయరాంపురం ప్రాదేశిక నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. శుక్రవారం జరిగిన ఎంపీపీ ఎన్నికల్లోనూ ఈమె విజయం సాధించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని