జిల్లాలో అన్ని స్థానాలూ గెలుచుకున్నాం: ఎంపీ
eenadu telugu news
Published : 25/09/2021 06:06 IST

జిల్లాలో అన్ని స్థానాలూ గెలుచుకున్నాం: ఎంపీ


రామభద్రపురంలో మాట్లాడుతున్న ఎంపీ బెల్లాన, మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు

బొబ్బిలి, రామభద్రపురం, న్యూస్‌టుడే: అప్పటి ఎన్నికల కమిషన్‌ ఏవేవో కారణాలు చూపించి స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసినా... ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో విజయం వైకాపానే వరించిందని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌ అన్నారు. శుక్రవారం రామభద్రపురంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రజలు వైకాపా పక్షాన ఉన్నారనడానికి ఇదే ఉదాహరణ అన్నారు. ఈ ఫలితాలు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనకు నిదర్శనమన్నారు. తొలుత తెదేపా నేతలు ఎన్నికలు బహిష్కరించామని, పోటీ చేయబోమని చెబుతూ చివరకు పోటీలో తలపడ్డారన్నారు. ప్రజలు సరైన తీర్పు ఇచ్చారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో, జిల్లాలో వైకాపా అభ్యర్థులు ఆధిక్యతతో విజయం సాధించారని పేర్కొన్నారు. జిల్లాలో 34 జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు వైకాపావేనని చెప్పారు. రామభద్రపురంలో కొండకెంగువ ఎంపీటీసీ స్వతంత్ర అభ్యర్థి ప్రసాదరావు అభివృద్ధిని కాంక్షించి వైకాపా ఎంపీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారని ఈ సందర్భంగా ఆయన్ను ఎంపీ అభినందించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని