9, 10 తేదీల్లో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు
eenadu telugu news
Published : 25/09/2021 13:31 IST

9, 10 తేదీల్లో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు


రింగురోడ్డు: జిల్లా కేంద్రంలో వచ్చే నెల 9, 10వ తేదీల్లో రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా చదరంగం అసోసియేషన్‌ అధ్యక్షులు రావు తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు వివరాలను ఆయన వెల్లడించారు. వయోపరిమితితో సంబంధం లేకుండా జిల్లాలో తొలిసారిగా రాష్ట్రస్థాయి పోటీలు జరగనున్నాయని, ఆసక్తిగలవారు 7వ తేదీ సాయంత్రం 5గంటల లోపు పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అయితే, కచ్చితంగా ap.chess.org వెబ్‌సైట్‌లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. ఇతర వివరాల కోసం 9703344488 నంబరును సంప్రదించాలని సూచించారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భీమారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జ్వాలాముఖి తదితరులు పాల్గొన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని