బలిజిపేటలో సీపీఎం ద్విచక్ర వాహన ర్యాలీ
eenadu telugu news
Updated : 25/09/2021 21:01 IST

బలిజిపేటలో సీపీఎం ద్విచక్ర వాహన ర్యాలీ

బలిజిపేట: భాజపా విధానాలను నిరసిస్తూ ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన భారత్‌ బంద్‌ను అందరూ విజయవంతం చేయాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ, వై.మన్మథరావు కోరారు. సంఘం నాయకులు ద్విచక్ర వాహనాలపై నినాదాలు చేస్తూ బలిజిపేట, పలగర, తుమరాడ, వెంగాపురం గ్రామాల్లో ప్రదర్శన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు తమ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చిరంజీవి, బలరాం, త్రినాథరావు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని