జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌ మృతి
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ అనిల్‌కుమార్‌ మృతి

న్యూస్‌టుడే:  జిల్లా పరిషత్తు వైస్‌ ఛైర్మన్‌ అంబటి అనిల్‌కుమార్‌ శుక్రవారం రాత్రి గుండెపోటుతో అకస్మాత్తుగా మృతిచెందారు. సాలూరు మండలం సన్యాసిరాజుపేట గ్రామానికి చెందిన ఆయనకు వివాహం కాలేదు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. అన్నయ్య, చెల్లెలకి వివాహాలు చేశారు. సాలూరు నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన ఆయన అతి చిన్నవయసులో జడ్పీ వైస్‌ఛైర్మన్‌ అయ్యారు. నాలుగునెలల కిందట ఆయన కొవిడ్‌ బారిన పడి కోలుకున్నారని సమీప బంధువులు చెబుతున్నారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొరకు ఆయన మేనల్లుడు అవుతారు. ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్‌ సూర్యకుమారి సంతాపం తెలిపారు. జిల్లాలోని పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కుటుంబ సభ్యులను పరామర్శించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని