పరిశ్రమల స్థాపనకు అనుకూలం: కలెక్టర్‌
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

పరిశ్రమల స్థాపనకు అనుకూలం: కలెక్టర్‌


మాట్లాడుతున్న సూర్యకుమారి

కలెక్టరేట్, న్యూస్‌టుడే: పరిశ్రమల స్థాపనకు, మార్కెటింగ్‌కు జిల్లాలో అనుకూల వాతావరణం ఉందని కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే వారికి చేయూత అందిస్తామన్నారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఫుడ్‌ ప్రొసెసింగ్, గిరిజన, చేనేత, చేతివృత్తులు, చిరుధాన్యాల గ్రేడింగ్, ఆర్గానిక్, మామిడి, జనప నార, తేనె, కూరగాయల ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమలకు అవకాశాలున్నట్లు తెలిపారు. ఈ నెల 28న బ్యాంకర్లతో నిర్వహించే రుణమేళాకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు హాజరైతే సమస్యల పరిష్కారం సులభం అవుతుందన్నారు. పలువురు పారిశ్రామిక ప్రతినిధులు సమస్యలను కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కార్యక్రమంలో జేసీలు మహేష్‌కుమార్, వెంకటరావు, పరిశ్రమల శాఖ మేనేజర్‌ శ్రీధర్‌ పాల్గొన్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని