తెల్ల బంగారానికి తెగుళ్ల నష్టం
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

తెల్ల బంగారానికి తెగుళ్ల నష్టం


రామభద్రపురంలో తడిసిన పత్తిని వేరుచేస్తున్న రైతులు

బొబ్బిలి, రామభద్రపురం, న్యూస్‌టుడే ఒకప్పుడు జిల్లాలో వరి సాగుతో పత్తి పోటీపడేది. అకాల వర్షాల వల్ల తెగుళ్లు సోకడంతో పత్తి దిగుబడి తగ్గింది. చేతికందాల్సిన సమయంలో వర్షాలు రైతుల కంట కన్నీటిని తెప్పిస్తున్నాయి. మద్దతు ధర లేకపోవడం, ప్రకృతి విపత్తులు తోడవడంతో పంట విసీˆ్తర్ణం తగ్గుతోంది. గులాబ్‌ కూడా ఎంతో నష్టాన్ని మిగిల్చింది.
సాగు విసీˆ్తర్ణం తగ్గుదల: సాగు విసీˆ్తర్ణం ఏటేటా తగ్గుతోంది. ఈ ఏడాది సాధారణ విసీˆ్తర్ణం 12476 హెక్టార్లు కాగా 8265 హెక్టార్లలో సాగు చేశారు. గతేడాది 9,700 హెక్టార్లలో చేశారు. ఇటీవల గులాబ్‌ దెబ్బకు 105 హెక్టార్లలో పంట పాడైందని అధికారులు గుర్తించారు. పత్తి చేలో నీరు చేరడంతో 40 శాతం వరకు పాడైందని చెబుతున్నారు. ఎకరాకు రూ.25వేల  వరకు ఖర్చు చేశామని...పంట విక్రయిస్తే ఆ మేరకు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు. గతేడాది కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(సీˆసీˆఐ) కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయకపోవడంతో ప్రైవేటు వ్యాపారులకు రైతులు విక్రయించారు.  మద్దతు ధర క్వింటా రూ.5526లుగా ప్రకటించినా కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం తెరవలేదు.

రంగు మారడంతో..
సాలూరు, పాచిపెంట, మక్కువ, రామభద్రపురం, బాడంగి, బొబ్బిలి, గరివిడి, గజపతినగరం, బొండపల్లి ప్రాంతాల్లో పత్తి సాగవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు చేలో నీరు చేరి కాయలు కుళ్లిపోతున్నాయి. ఎకరాకు 7 నుంచి 8 క్వింటాళ్లకు గానూ ప్రస్తుతం 4 క్వింటాళ్లు వస్తోందని రైతులు చెబుతున్నారు. సాగు ఖర్చులు రావడం లేదని కన్నీరు కారుస్తున్నారు. రామభద్రపురం మండలంలోని సీˆతారాంపురం, రొంపల్లి, ఇట్లామామిడిపల్లి, కొండకెంగువ, పాతరేగ, జన్నివలస, కొట్టక్కి, తారాపురం,  బూసాయవలస, ముచ్చర్లవలస, ఆరికతోట, సోంపురం, నాయుడువలస, పాలవలస గ్రామాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది.

కొనుగోలు చేయాలి
పంట కలిస్తొందని ఈ ఏడాది 2 ఎకరాల్లో వేశాం. సాగు ఖర్చుల కింద రూ. 50 వేల చొప్పున ఖర్చు చేశాం. ఎకరాకు 8 క్వింటాళ్లు వస్తుందనుకున్నాం. మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా రాలేదు. అప్పుచేసి పెట్టుబడులు పెట్టాం. ఉన్న పంటను కొనుగోలు చేసే వారు లేరు - మంగమ్మ, అప్పన్నమ్మ, సింహాచలం, మహిళా రైతులు, రామభద్రపురం.

నివేదికలు రావాలి  
ఇటీవల కురిసిన వర్షాలకు 105 హెక్టార్లలో పత్తి పంటకు నష్టం వాటిల్లినట్లు గుర్తించాం. తెగుళ్లు సోకి పాడైన పంట వివరాలు తెలుసుకోవాలి. క్షేత్ర స్థాయిలో సిబ్బందికి పరిశీలించాలని సూచిస్తాం. 
 - ఆశాదేవి, జేడీ, వ్యవసాయశాఖ.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని