పరీక్షకు గంట ముందు కేంద్రం మార్పు
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

పరీక్షకు గంట ముందు కేంద్రం మార్పు

 
మార్చిన కేంద్రం ముందు గుమిగూడిన విద్యార్థులు  

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: మరో గంటలో పరీక్ష ప్రారంభం అవుతుందనగా కేంద్రం మార్చడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు.  జిల్లాలో 2011- 2020 మధ్య డిగ్రీలో తప్పిన సుమారు 1400 మందికి ప్రత్యేక డ్రైవ్‌ కింద ఆంధ్ర విశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా జిల్లా కేంద్రంలోని మహరాజా డిగ్రీ కళాశాల(కోట)లో ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగాల్సి ఉంది. ఎనిమిది గంటలకు బీఎస్సీ సబ్జెక్టుల వారికి కేంద్రాన్ని రెండు కిలోమీటర్ల దూరంలోని ప్రైవేటు కళాశాలకు మార్చినట్లు అధికారులు తెలియజేయడంతో సుమారు వెయ్యి మంది పరుగులు తీశారు. పరీక్ష సమయం దగ్గర పడటంతో ఆందోళన చెందారు. మహరాజా కళాశాల కేంద్రంలో 300 మందికి సరిపడా వసతి ఉండటంతో బీఏ, బీకాం అక్కడ వారికి కేటాయించి బీఎస్సీ కేంద్రాన్ని మార్చినట్లు కళాశాల ప్రధానాచారిణి సూర్యకాంతి తెలిపారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా పరీక్ష సమయాన్ని పెంచామన్నారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని