ధాన్యం కొనుగోలుకు సమాయత్తం
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

ధాన్యం కొనుగోలుకు సమాయత్తం


అధికారులతో సమీక్షిస్తున్న జేసీ కిశోర్‌కుమార్‌

కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఈ ఏడాది ఖరీఫ్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలుకు అధికారులు సమాయత్తం కావాలని జేసీ జీసీ కిశోర్‌కుమార్‌ ఆదేశించారు. ఆయన ఛాంబర్లో జిల్లా ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సారి కొనుగోలుకు సుమారు 800 పీపీసీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సీజన్‌ ప్రారంభానికి ముందే ఈ-కేవైసీ పూర్తి, రైతులకు మద్దతు ధర వివరాలను తెలియజేయాలన్నారు. సాధారణ రకం క్వింటాకు ప్రస్తుతం రూ.1,940, గ్రేడ్‌-ఏ రకానికి రూ.1,960 ఇస్తున్నట్లు తెలిపారు.  జిల్లా రైస్‌ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు కొండబాబు, డీఆర్‌డీఏ ఇన్‌ఛార్జి పీడీ అశోక్‌కుమార్, డీఎస్‌వో పాపారావు, వ్యవసాయశాఖ డీడీలు ఆనందరావు, నంద్, మార్కెటింగ్‌ ఏడీ శ్యామ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని