భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

భూముల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి


సమావేశంలో మాట్లాడుతున్న తహసీల్దారు రమణమ్మ

భోగాపురం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ విమానాశ్రయం రానున్న నేపథ్యంలో మండలంలో ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ సిబ్బందిపై ఉందని తహసీల్దారు రమణమ్మ అన్నారు. వీఆర్వోలు, సర్వేయర్లతో శనివారం సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో రీసర్వే మొదలైందని, ఆక్రమణలు గుర్తిస్తే క్రిమినల్‌ చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారికి ఆనుకుని ఏర్పాటు చేస్తున్న దుకాణాలపై దృష్టి సారించాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే సరెండర్‌ చేస్తామన్నారు. ఉపతహసీల్దారు గాంధీ, సర్వేయరు శివాజీ, ఆర్‌ఐ జోగినాయుడు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని