కొబ్బరి తోట ధ్వంసం దారుణం: తెదేపా
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

కొబ్బరి తోట ధ్వంసం దారుణం: తెదేపా


నరికివేసిన చెట్లను పరిశీలిస్తున్న నాయకులు

పూసపాటిరేగ, న్యూస్‌టుడే: పూసపాటిరేగ మండలంలోని వెల్దూరులో దారపు పెంటయ్యకు చెందిన కొబ్బరి తోటను ధ్వంసం చేయడం దారుణమని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు పేర్కొన్నారు. నరికివేసిన కొబ్బరిచెట్లను పార్టీ నాయకులతో కలసి శనివారం పరిశీలించారు. రాజకీయ కక్షలతో ఆస్తులను ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. నిందితులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. భోగాపురం సీఐ శ్రీధర్‌, ఎస్‌ఐ జయంతిని కలిసి విన్నవించారు. కేసు నమోదు చేశామని, చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. కార్యక్రమంలో తెదేపా జిల్లా పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, టీఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు జగన్నాథం, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తారకరామానాయుడు, తెదేపా మండల అధ్యక్షుడు శంకరరావు, పార్టీ నాయకులు తమ్మినాయుడు, భూలోకా, గోపి, సర్పంచి సత్యవతి ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని