గిరిజన సమస్యలపై ఆరా
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

గిరిజన సమస్యలపై ఆరా


జామిలో సూచనలిస్తున్న న్యాయమూర్తి లక్ష్మీరాజ్యం

వేపాడ, జామి, గరివిడి, న్యూస్‌టుడే: వేపాడ మండలంలోని కొండగంగుబూడి గిరిజన పంచాయతీలోని సమస్యలపై జిల్లా జడ్జి లక్ష్మీరాజ్యం ఆరా తీశారు. న్యాయ అవగాహన సదస్సులో భాగంగా కొత్తవలస సివిల్‌ జడ్జి సూర్య కిరణ్‌శ్రీతో పాటు పాల్గొన్నారు. పాఠశాల, ఆసుపత్రి, తాగునీటి వసతులపై ఆరా తీశారు. కొత్తవలస న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు కె.మహేశ్వరరావు, ఉపాధ్యక్షుడు డి.శ్రీనివాస్‌, ఎస్‌ఐ బి.దేవి, సర్పంచి బంగారయ్య తదితరులు పాల్గొన్నారు. ● జామిలోనూ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎస్‌కోట బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సత్యాజీ, తహసీల్దారు నీలకంఠం, సర్పంచి లక్ష్మి, ఎఎస్‌ఐ గోపీరావు, న్యాయవాదులు పాల్గొన్నారు. ● గరివిడిలో చీపురుపల్లి జేఎఫ్‌సీఎం కోర్టు జూనియర్‌ సివిల్‌ జడ్డి, మండల న్యాయ సేవా సంస్థ ఛైర్మన్‌ ఎం.విజయ రామేశ్వరి అవగాహన కల్పించారు. సీఐ జి.సంజీవరావు, ఎస్‌ఐ నీలావతి, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని