సమయపాలన పాటించాలి
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

సమయపాలన పాటించాలి


వ్యాక్సినేషన్‌ పరిశీలిస్తున్న పీవో కూర్మనాథ్‌

జియ్యమ్మవలస, న్యూస్‌టుడే: కరోనా కట్టడికి వ్యాక్సినేషన్‌ తప్పనిసరని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆర్‌.కూర్మనాథ్‌ అన్నారు. శనివారం బీజేపురం, తుంబలి గ్రామ సచివాలయాలను పరిశీలించిన ఆయన అక్కడ ప్రజలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, వాలంటీర్లు, సిబ్బంది సీజనల్‌ వ్యాధులు, పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. అసంతరం సిబ్బంది హాజరు, ప్రగతి నివేదిక దస్త్రాలు చూశారు.

ప్రతి మొక్కా బతకాల్సిందే...: పార్వతీపురం: ఉపాధి పథకం కింద ఈ ఏడాది చేపట్టిన జీడితోటల పెంపకంలో ప్రతి మొక్క బతికి తీరాల్సిందేనని ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌ అన్నారు. శనివారం సాయంత్రం తన కార్యాలయంలో ఏజెన్సీ మండలాల ఏపీవోలతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఒకవేళ ఎక్కడైనా మొక్కలు లేవంటే దానికి క్షేత్రస్థాయి సిబ్బంది బాధ్యత వహించాలన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని