ప్రతిపాదనలకే పరిమితం
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

ప్రతిపాదనలకే పరిమితం


అధ్వానంగా ఉన్న రేకుల షెడ్డు

బెలగాం, న్యూస్‌టుడే: పార్వతీపురంలోని పురపాలక పరిధిలో ఉన్న చేపల బజారు అభివృద్ధి గత రెండేళ్లుగా ప్రతిపాదలకే పరిమితమవుతోంది. ఇక్కడ ప్రస్తుతం అసౌకర్యాలు నెలకొన్నాయి. నిత్యం వందలాది మంది కొనుగోలుదారులు, వ్యాపారులతో రద్దీగా ఉండే ఈ మార్కెట్‌లో అవస్థలు తప్పడం లేదు. ఇక్కడ మత్స్యకారులతో పాటు, మాంసం విక్రయదారులు వ్యాపారం సాగిస్తున్నారు. సుమారు 150 మంది ఈ బజారుపై ఆధారపడి జీవిస్తుండగా పరోక్షంగా మరో 300 మంది పలు రకాల పనులు చేసుకుంటారు. డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్తు సదుపాయం తదితర సౌకర్యాలు లేకపోవడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన రేకుల షెడ్లు మాత్రమే వారందరికీ ఆధారం. ప్రస్తుతం ఇది శిథిలావస్థకు చేరింది. ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని కూలిపోవడం మరిన్ని ఇక్కట్లు ఎదురవుతున్నాయి. బజారు అభివృద్ధికి మత్స్యశాఖ రూ.30 లక్షల నిధులు మంజూరుకు అంగీకారం తెలిపింది. ఈ నిధులతో అభివృద్ధి చేయాలని ప్రతిపాదనలు చేస్తున్నారు తప్పా కార్యరూపం దాల్చడం లేదు. దీనిపై కమిషనరు సింహాచలంను వివరణ కోరగా రూ.30 లక్షలతో ఆధునికీకరణకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభిస్తామన్నారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని