నిస్వార్థ సేవలు ప్రశంసనీయం: జేసీ
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

నిస్వార్థ సేవలు ప్రశంసనీయం: జేసీ


దివ్యాంగుడికి కృత్రిమ కాలు అందిస్తున్న కిశోర్‌ కుమార్‌

కొత్తవలస, న్యూస్‌టుడే: నిస్వార్థ.మైన ఆలోచనలతో మంగళపాలెం శ్రీగుదేవ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ రాపర్తి జగదీష్‌కుమార్‌ దివ్యాంగులకు ఎనలేని సేవలు అందిస్తున్నారని జేసీ కిషోర్‌ కుమార్‌ ప్రశంసించారు. శనివారం ట్రస్ట్‌ను ఆయన సందర్శించి కృత్రిమ అవయవాల తయారీ విధానం, ప్రాంగణంలోని శ్రీగురు ఆస్పత్రిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దివ్యాంగులకు శారీరక, మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కల్పిస్తున్నారని కొనియాడారు. ట్రస్ట్‌కు తనవంతు సహాయపడతానని ప్రకటించారు. దివ్యాంగులకు కృత్రిమ అవయవాలు, ఉపకరణాలు, పింఛన్లు, వృద్ధులకు బియ్యం ఆయన పంపిణీ చేశారు. తహసీల్దారు ఎస్‌.రమణారావు, ఎంపీడీవో జి.వెంకటరావు, ట్రస్ట్‌కు సహాయ పడుతున్నవారిని శాలువలు కప్పి సత్కరించారు. గ్రామ సర్పంచి లక్ష్మి, ట్రస్ట్‌ ప్రతినిధులు డాక్టర్‌ ఫణీంద్ర, అనిల్‌ప్రేమ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని