విద్యారంగాన్ని కాపాడాలి: ఎస్‌ఎఫ్‌ఐ
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

విద్యారంగాన్ని కాపాడాలి: ఎస్‌ఎఫ్‌ఐ


పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, విద్యార్థులు

చీపురుపల్లి, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాలలను మూసివేసి పేద విద్యార్థులను చదువుకు దూరం చేయొద్దని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ కోరారు. చీపురుపల్లిలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభలు శనివారం ప్రారంభమయ్యాయి. ముందుగా పట్టణ వీధుల్లో విద్యార్థులతో కలసి నాయకులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభలో రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ మాట్లాడుతూ విద్యారంగాన్ని కాపాడాలన్నారు. ఎయిడెడ్‌ విద్యా సంస్థలను ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో రుసుములు విపరీతంగా పెంచేయడం వల్ల పేద విద్యార్థులకు ఆర్థిక భారం తప్పడం లేదన్నారు. దీనిపై అధికారులు దృష్టి సారించి నియంత్రించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలలు, పాఠశాలలకు వచ్చే విద్యార్థుల కోసం బస్సులు నడపాలన్నారు. పీజీ కోర్సులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ను అమలు చేయాలని, బకాయిలను విడుదల చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి కె.సతీష్‌దేవ్‌సింగ్‌, నాయకులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని