అప్పులు తీర్చలేక.. బతుకు సాగించలేక..
eenadu telugu news
Published : 24/10/2021 05:42 IST

అప్పులు తీర్చలేక.. బతుకు సాగించలేక..


వెంకటనాయుడు (పాత చిత్రం)

గరుగుబిల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: చేసిన అప్పులు తీర్చలేక.. రుణదాతల ఒత్తిడి తట్టుకోలేక తోటపల్లి జలాశయంలో దూకి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గరుగుబిల్లి మండలం పెద్దూరు గ్రామంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ గ్రామానికి చెందిన బడే వెంకటనాయుడు(36) కొన్నేళ్లుగా విశాఖపట్నంలోని ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలసి అక్కడే నివాసం ఉంటున్నాడు. అక్కడ పలువురి దగ్గర అప్పులు చేయడంతో వాటిని తీర్చలేక మూడు నెలల క్రితం సొంతూరు వచ్చేశాడు. మూడురోజుల కిందట ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు అన్ని చోట్లా వెతికారు. తోటపల్లి జలాశయంలో శనివారం వెంకటనాయుడు మృతదేహాన్ని గుర్తించి స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్సై సింహాచలం అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని వెలికి తీయించి శవపరీక్ష కోసం పార్వతీపురం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. దీనిపై తండ్రి త్రినాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని