పోలీసు వ్యవస్థపై గౌరవం పెరగాలి
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

పోలీసు వ్యవస్థపై గౌరవం పెరగాలి


ఓపెన్‌ హౌస్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న విద్యార్థి కౌశిక్‌

విజయనగరం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్థానిక పరేడ్‌ మైదానంలో ‘ఓపెన్‌ హౌస్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేఎల్‌పురం పురపాలక పాఠశాల విద్యార్థి కౌశిక్‌తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభింపజేశారు. డీఐజీ ఎల్‌కేవీ రంగారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌తో కలిసి పోలీసుల విధులు, ఉపయోగించే ఆయుధాలు, సాంకేతికత తదితరాలపై అవగాహన కల్పించారు. పోలీసుల త్యాగాలు...వారి సేవలు ప్రజల్లోకి వెళ్లినప్పుడే ఈ వృత్తిపై మరింత గౌరవం పెరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ పోలీసులను గౌరవించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యనారాయణరావు, ఓఎస్‌డీ ఎన్‌.సూర్యచంద్రరావు, ఏఆర్‌ డీఎస్పీ ఎల్‌.శేషాద్రి, విజయనగరం డీఎస్పీ పి.అనిల్‌కుమార్‌, ట్రాఫిక్‌ డీఎస్పీ ఎల్‌.మోహనరావు తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని