కొఠియా వివాదాస్పద గ్రామాల్లో పర్యటన
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

కొఠియా వివాదాస్పద గ్రామాల్లో పర్యటన


స్థానికులతో చర్చిస్తున్న పీవో, సబ్‌ కలెక్టరు

సాలూరు గ్రామీణం, న్యూస్‌టుడే: కొఠియా వివాదాస్పద గ్రామాల్లో ఐటీడీఏ పీవో కూర్మనాథ్‌, సబ్‌ కలెక్టరు భావన బుధవారం పర్యటించారు. నేరేళ్లవలస, ధూళిభద్ర, దొర్లతాడ్డివలస, పగులుచెన్నూరు గ్రామాల్లో పర్యటించి..గిరిజనంతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? అని అడిగి తెలుసుకున్నారు. పథకాలు అందరికీ అందేలా చూడాలన్నారు. నేరేళ్లవలసలో పోలీసుల అవుట్‌ పోస్టు ఏర్పాటుకు ప్రయత్నిస్తామని పీవో అన్నారు. తహసీల్దారు, సీఎస్‌డీటీలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని