వాలీబాల్‌ పోటీల విజేత విజయనగరం
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

వాలీబాల్‌ పోటీల విజేత విజయనగరం


ట్రోఫీ అందజేస్తున్న నిర్వాహకులు

విశాఖ క్రీడలు, న్యూస్‌టుడే: రెండో డీఆర్‌ఎం కప్‌ అఖిల భారత ఆహ్వానపు వాలీబాల్‌ పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా జట్టు ద్వితీయ స్థానాన్ని సాధించింది. రెండు జట్ల మధ్య బుధవారం రాత్రి రైల్వేస్టేడియంలో జరిగిన తుది పోరు ఆద్యంతం ఉత్కంఠఫఫగా సాగింది. చివరికి విజయనగరం జట్టు 25-15, 26-24, 25-22తో ప.గో.జిల్లా జట్టుపై గెలుపొందింది. విజేత జట్లకు డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ శత్పథి, పశ్చిమ ఎమ్మెల్యే, భారత వాలీబాల్‌ సమాఖ్య ఉపాధ్యక్షుడు పెతకంశెట్టి గణబాబు ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని