సీఆర్టీల ఆందోళన ఉద్రిక్తం
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

సీఆర్టీల ఆందోళన ఉద్రిక్తం


నిరసనకారులను వాహనాల్లో స్టేషన్‌కు తరలిస్తున్న పోలీసులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: గిరిజన సంక్షేమశాఖలో ఒప్పంద ఉపాధ్యాయుల సేవల పునరుద్ధరణపై యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో సీఆర్టీలు బుధవారం ఐటీడీఏ ముట్టడించారు. ఉదయం నుంచి కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద బైఠాయించి రాకపోకలను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇతర శాఖల్లో ఒప్పంద ఉపాధ్యాయుల సేవలను కొనసాగిస్తున్న ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖలోని సీఆర్టీల విషయంలోనే ఎందుకు తాత్సారం చేస్తోందో తెలియడం లేదని వాపోయారు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికీ స్పష్టత ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పీవో కూర్మనాథ్‌ కొఠియా గ్రామాలకు వెళ్లడంతో ఆయన వచ్చేంత వరకు ప్రధాన ద్వారాన్ని తెరవనిచ్చేది లేదన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో ఉద్యోగులను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకుని సీఆర్టీలను వాహనాల్లో ఎక్కించి పోలీసుస్టేషనుకు తరలించారు.

గిరిజన సంఘం ఆధ్వర్యంలో...: గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గిరిజన సీఆర్టీలు కొనసాగింపు ఉత్తర్వులు ఇవ్వాలని కోరుతూ పి.రంజిత్‌కుమార్‌ నాయకత్వంలో వేరేగా దీక్షలు చేపట్టారు. పీవో చర్చించారు. దీనిపై రంజిత్‌ మాట్లాడుతూ గిరిజన శాఖా మంత్రి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని, రెండ్రోజుల్లో ఉత్తర్వులు వస్తాయని పీవో వెల్లడించారన్నారు. దీంతో దీక్షను విరమించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని