ఉద్యోగోన్నతి ఉత్తర్వుల అందజేత
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

ఉద్యోగోన్నతి ఉత్తర్వుల అందజేత


పత్రాలు అందజేస్తున్న జడ్పీ ఛైర్మన్‌ శ్రీనివాసరావు

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయులుగా ఉద్యోగోన్నతులు పొందిన 24 మంది ఉపాధ్యాయులకు బుధవారం జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు ఉత్తర్వులు అందజేశారు. సోమవారం వీరికి ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించారు. మంగళవారం డీఈవో కార్యాలయంలో కౌన్సెలింగ్‌ ఆధారంగా ప్రదేశాలు కేటాయించారు. పీహెచ్‌సీ కోటాలో ఇద్దరివి వైకల్యం నిర్ధారణ చేయాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఈవో ఎన్‌.సత్యసుధ, ఉప విద్యాశాఖాధికారి బ్రహ్మాజీ, సహాయ సంచాలకులు ఎస్‌.లక్ష్మణరావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: జడ్పీ పరిధిలోని పలు కార్యాలయాల్లో పనిచేస్తూ ఇటీవల పలువురు కొవిడ్‌తో మృతిచెందారని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయా కుటుంబాలతో సమావేశమయ్యారు. ఇందులో పలువురికి ఉద్యోగాలు ఇచ్చేందుకు దరఖాస్తులు స్వీకరించారు. నలుగురిని కార్యాలయ సహాయకులుగా నియమించినట్లు జడ్పీ సీఈవో తెలిపారు. తదుపరి దశలో మరికొందరికి అవకాశం కల్పిస్తామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని