నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని విన్నపం
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని విన్నపం


సీఎంను కలిసిన ఎమ్మెల్యే బడ్డుకొండ, ఎమ్మెల్సీ పెనుమత్స తదితరులు

నెల్లిమర్ల, న్యూస్‌టుడే: తారకరామతీర్థ సాగర్‌ ప్రాజెక్టు నిర్వాసితులకు పీఏఎఫ్‌ ప్యాకేజీ ఇప్పించాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని ఎంపీ బెల్లాన చంద్రశేఖర్‌, ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు, ఎమ్మెల్సీ పెనుమత్స సూర్యనారాయణరాజు విన్నవించారు. ఈమేరకు బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. ప్రాజెక్టుతో ప్రభావితమవుతున్న సారిపల్లి, నీలంరాజుపేట, కుదిపి గ్రామాలకు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేసి న్యాయం చేయాలని కోరారు. గతంలో ఆర్‌ఆర్‌ ప్యాకేజీ కింద నిర్వాసిత రైతుల నుంచి పంట భూములను తక్కువ ధరలకు తీసుకున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సారిపల్లి సర్పంచి రాయి పైడమ్మ, జడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, వైకాపా జిల్లా ప్రధాన కార్యదర్శి అంబళ్ల శ్రీరాములనాయుడు, డీసీసీబీ ఉపాధ్యక్షుడు చనుమల్లు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని