ప్రభుత్వం దృష్టికి బీసీ కులాల సమస్యలు
eenadu telugu news
Published : 28/10/2021 05:20 IST

ప్రభుత్వం దృష్టికి బీసీ కులాల సమస్యలు

ప్రసంగిస్తున్న కమిషన్‌ ఛైర్మన్‌ శంకర్‌నారాయణ

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: బీసీ కులాల అభిప్రాయాలను గౌరవిస్తామని, వారి సమస్యలపై కమిషన్‌లో చర్చించి, అనంతరం ప్రభుత్వానికి విన్నవిస్తామని రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌ ఎ.శంకర్‌నారాయణ తెలిపారు. కలెక్టరేట్‌ ఆడిటోరియంలో బుధవారం జరిగిన సమావేశంలో కమిషన్‌ ఛైర్మన్‌, ముగ్గురు సభ్యులు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల జాబితాలో ఉన్న కులాలను ప్రస్తుతం ఉన్న గ్రూపు నుంచి మార్చాలని, కులధ్రువీకరణ పత్రాల మంజూరులో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని అనేక విజ్ఞాపనలు వచ్చాయన్నారు. దీనిపై బహిరంగ విచారణ చేపట్టామన్నారు. అన్ని కులాలు, వర్గాలవారు ఇచ్చిన వినతులను, చెప్పిన అంశాలను, వారి స్థితిగతులను పరిశీలించి, క్షుణ్ణంగా చర్చించి, అభిప్రాయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. కమిషన్‌ సభ్యులు ఎం. కృష్ణప్ప, పి. దివాకర్‌, ఎ.ముసలయ్య, మెంబర్‌ కార్యదర్శి డి.చంద్రశేఖరరాజు మాట్లాడారు. జేసీ(ఆసరా) జె.వెంకటరావు పాల్గొన్నారు. తొలుత కమిషన్‌ సభ్యులను జడ్పీ అతిథిగృహంలో కలెక్టర్‌ ఎ.సూర్యకుమారి, ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని