బలిజిపేటలో రాస్తారోకో
eenadu telugu news
Updated : 28/10/2021 16:55 IST

బలిజిపేటలో రాస్తారోకో

బలిజిపేట: పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బలిజిపేటలో గురువారం సీపీఎం, హనుమాన్‌ ఆటో కార్మికులు గురువారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్‌ వద్ద అన్ని వాహనాల రాకపోకలను నిలిపేసి తమ నిరసన తెలియజేశారు. పెంచిన డీజిల్‌ ధరల వల్ల తాము ఆటోలు నడపలేకపోతున్నామని, ఆర్థిక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ఆటో కార్మిక సంఘం అధ్యక్షుడు సీతారాం అన్నారు. 100రోజుల్లో ధరలు తగ్గిస్తామని, రెండోసారి అధికారంలోకి వచ్చిన భాజపా అన్నింటిపై రెట్టింపు ధరలు పెంచి సామాన్యులను ఇబ్బందులకు గురి చేసిందని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సత్యనారాయణ అన్నారు. కార్యక్రమంలో నాయకులు వై.మన్మథరావు, భానుమూర్తి, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని