రహదారుల్లో తిరిగి మొక్కలు నాటాలి
eenadu telugu news
Updated : 28/10/2021 16:57 IST

రహదారుల్లో తిరిగి మొక్కలు నాటాలి

బలిజిపేట: మండలంలోని వెంగాపురం, పెదపెంకి, చిలకలపల్లి రహదారుల్లో ఉద్యాన, ఉపాధి అధికారులు నాటించిన మొక్కలు కొన్ని చనిపోయాయి. మొక్కల ఎదుగుదల లేకుండా కంచె వేయడంతో ఆ ప్రదేశాల్లో కంచెలు మిగిలాయి తప్ప మొక్కలు కనిపించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఉపాధి హామీ పథకం ఏపీవో శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేశారు. చనిపోయిన మొక్కల ప్రదేశంలో కొత్తవాటిని నాటించాలని వారు కోరారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఉద్యాన శాఖ, ఉపాధి హామీ అధికారుల సమక్షంలో వీటిని తిరిగి నాటిస్తామని ఆయన హామీ ఇచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని