Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి

ముస్లిం మత పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న డీఆర్‌వో రమాదేవి

ములుగు, న్యూస్‌టుడే: రంజాన్‌ పండగను పురస్కరించుకొని ముస్లిం సోదరులు కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని డీఆర్‌వో రమాదేవి అన్నారు. మంగళవారం ఆమె మత పెద్దలతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని 9 మండలాల పరిధిలోని ముస్లిం సోదరులకు ప్రభుత్వం 1500 దుస్తుల ప్యాకెట్లు కేటాయించినట్లు వివరించారు. జనాభా ప్రాతిపదికన జాబితాను తయారు చేసి వారిలో పేద కుటుంబాలకు వాటిని అందించాలన్నారు. గతంలో చేసినట్లుగానే ఈ సారి కూడా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా పంపిణీ ప్రక్రియ ప్రశాంతంగా జరగాలన్నారు. మైనార్టీ సంక్షేమాధికారి జర్సన్‌కుమార్‌, తహసీల్దారు సత్యనారాయణ, వివిధ మండలాల మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని