Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఏజెన్సీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన


ఐటీడీఏలో ధ్రువపత్రాలు పరిశీలిస్తున్న అధికారులు

ఏటూరునాగారం, న్యూస్‌టుడే: ఏజెన్సీ అభ్యర్థుల ధ్రువపత్రాలను జిల్లా స్థాయి పరిశీలక కమిటీ మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో పరిశీలించింది. జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి, అటవీశాఖ, టీఆర్‌టీ నియామకాలకు ఎంపికైన పలువురి అభ్యర్థుల ఏజెన్సీ ధ్రువపత్రాల పరిశీలన కరోనా కారణంగా పూర్తి కాలేదు. వారి ధ్రువపత్రాలను అధికారులు క్రమంగా పరిశీలన చేపడుతున్నారు. అందులో భాగంగానే సోమవారం, మంగళవారం గిరిజన సంక్షేమ ఉప సంచాలకుడు ఎం.ఎర్రయ్య, రాష్ట్ర ట్రైబల్‌ కల్చర్‌, రీసర్చ్‌, ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ (హైదరాబాద్‌) నుంచి వచ్చిన పరిశోధన అధికారి లీల అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించి జెన్యూనిటీ జారీ చేశారు. ములుగు జిల్లా నుంచి మొత్తం 68 మంది అభ్యర్థుల్లో 20 మంది పెండింగు ఉండగా సంబంధిత అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా 4, మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన 31 మంది అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డీడీ మాట్లాడుతూ.. త్వరలో అభ్యర్థులందరి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి జెన్యూనిటీ ధ్రువీకరణ చేస్తామని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని