Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

వేలం ప్రక్రియకు స్పందన కరవు


వేదికపై కమిషనర్‌ నరసింహ, ఛైర్‌పర్సన్‌ జమున, వైస్‌ ఛైర్మన్‌ రాంప్రసాద్‌, తదితరులు 

జనగామ, న్యూస్‌టుడే: జనగామ పురపాలికకు చెందిన వ్యాపార సముదాయాల్లో ఖాళీగా ఉన్న దుకాణాలను అద్దెకు ఇచ్చేందుకు నిర్వహించిన వేలం ప్రక్రియకు వ్యాపారుల నుంచి స్పందన కరవైంది. స్థానిక మున్సిపాల్టీకి సంబంధించి తొమ్మిది దుకాణాలకు మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు. మూడు నెలల క్రితం నిర్వహించిన వేలం ప్రక్రియలో నిబంధనలు పాటించని తీరుపై ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనంపై అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌హమీద్‌ స్పందించారు. అప్పటి ఒప్పందాన్ని రద్దు చేసి, నిబంధనల ప్రకారం వేలం నిర్వహించాలన్నారు. మూడు నెలలైనా నిర్వహించకపోవడంతో మున్సిపల్‌ ఆదాయానికి గండి పడుతుందంటూ ‘న్యూస్‌టుడే’ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన వారు 9 దుకాణాలకు వేలం ప్రకటన జారీ చేశారు.


డీడీ వాపస్‌ చేసి, వేలంలో పాల్గొనకుండా చేశారని మహిళ ఆవేదన

తొమ్మిది మడిగలకు వేలం.. ఒక దానికే ఖరారు

మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పోకల జమున, వైస్‌ఛైర్మన్‌ మేకల రాంప్రసాద్‌, కమిషనర్‌ కె.నరసింహ, ఫ్లోర్‌లీడర్‌ మారబోయిన పాండు సమక్షంలో వేలం నిర్వహించారు. తొమ్మిది దుకాణాలను అద్దెకు ఇవ్వడానికి నిర్ణయించగా, దుకాణం నెం.3, 21, 25లకు ఎవరూ దరఖాస్తు చేయలేదు. నెం.1,9,10,20,23,లకు ఒక్కొక్క టెండరు దాఖలైంది. సింగిల్‌ టెండర్‌ను పరిగణనలోకి తీసుకోరాదనే నిబంధన ఉంది. దీంతో నెం.28 దుకాణానికి నలుగురు వేలంలో పాల్గొన్నారు. మారబోయిన సంతోష్‌ రూ.13,600కు సదరు దుకాణానికి అత్యధిక పాటదారుగా ఎంపికయ్యారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ నాగరాజు, మల్లేశం తదితరులు పాల్గొన్నారు. కొన్ని దుకాణాలకు ఇప్పటికి రెండు, మూడు పర్యాయాలు ఒక్కరే టెండరు వేస్తున్నారని, నిబంధనల పేరిట వారికి అవకాశం ఇవ్వకపోవడంతో, దుకాణం ఖాళీగా ఉంటోందని, మున్సిపాల్టీకి నష్టం వాటిల్లుతోందని కౌన్సిలర్లు అభిప్రాయపడ్డారు. మూడు పర్యాయాలు ఎవరూ రాని పక్షంలో సింగిల్‌ టెండర్‌దారును ఖరారు చేసే అవకాశాన్ని కౌన్సిలర్‌ పరిశీలించవచ్చునని కమిషనర్‌ నరసింహ పేర్కొన్నారు.

* ఇదే దుకాణానికి వేలంలో పాల్గొనేందుకు నిబంధనల మేరకు ఓ గిరిజన మహిళ డీడీ సమర్పించారు. ఆమె భర్త నేతావత్‌ శ్రీనివాస్‌ గతంలో నెం.27 దుకాణాన్ని రికార్డు ధర నెలకు రూ.46,200తో అద్దెకు తీసుకున్నారు. ఆరు నెలలలోపే ఆయన, సదరు దుకాణం అద్దె చెల్లించలేదని, దీంతో దుకాణాన్ని మూసి వేయాల్సి వచ్చిందని, ఈప్రక్రియలో ఆయన భార్య తన పేరిట వేలంలో పాల్గొనేందుకు వచ్చినందున, అవకాశం ఇవ్వలేదని అధికారులు చెబుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని