Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గుడి ఒకచోట.. కల్యాణం మరోచోట

న్యూస్‌టుడే, పాలకుర్తి

వల్మిడిలోని సీతారామచంద్రస్వామి ఆలయం

పాలకుర్తి మండలం వల్మిడి గ్రామానికి దశాబ్ధాల చరిత్ర ఉంది. ఈ ప్రాంతం లవకుశల జన్మస్థలంతోపాటు వాల్మీకి మహర్షి తపమాచరించిన నేలగానూ ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో రెండు గుట్టలు పక్కపక్కనే కొలువయ్యాయి. ఒకటి శ్రీసోమ మునుల గుట్ట, మరొకటి శ్రీరామునిగుట్ట. వాల్మీకి ఈ కొండల మధ్యనే తపం చేసి ఆశ్రమం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. గుట్టపై పుష్కరిణిని మునుల గుండం, జీడి గుండంగా పిలుస్తారు. సీతారామచంద్రస్వామి వారలు పాలగుండంలో స్వయంభూవులుగా వెలిశారని ప్రతితి. సహజసిద్ధంగా ఏర్పడిన ఆయా గుండాల్లో స్నానం చేసి ఆ నీళ్లను శిరస్సుపై చల్లుకుంటే సకల పాపాలు హరిస్తాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. గుండాలు ఎప్పుడు ఎండిపోయిన దాఖలాలు లేవు.


గుట్టపై ఉన్న గుండం, ధ్వజస్తంభం

ఈసారి భక్తులకు అనుమతి లేదు..

ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో శ్రీరామనవమిని వైభవంగా జరుపుతారు. గ్రామంలో ఆలయం ఉంటే గుట్టపై ప్రత్యేక కల్యాణ మండపంలో సీతారామచంద్రస్వామి కల్యాణ్యాన్ని నిర్వహిస్తుండటం విశేషం. ఆలయం నుంచి గుట్ట సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ధ్వజస్తంభం, మూల విరాట్‌ ఉన్న ప్రదేశంలోనే కల్యాణం జరగాల్సి ఉన్నందున గుట్టపైనే ఆ క్రతువును జరిపిస్తారు. ఆలయంలో కేవలం స్వామివారి ఉత్సవ మూర్తులు మాత్రమే ఉంటాయి. ఉగాది తర్వాత స్వామివారు ఆలయాన్ని వీడి గుట్టపైకి చేరుతారు. అనంతరం బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మంత్రి ఎర్రబెల్లి చొరవతో రూ.2 కోట్లతో పాలకుర్తి-కొడకండ్ల రహదారిపై వల్మిడి నుంచి ఆలయ గుట్ట వరకు ఇటీవల బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. దీంతో భక్తులు నేరుగా వాహనాల్లో గుట్టపైకి వెళ్లే వెసులుబాటు ఏర్పడింది. అలాగే పాలకుర్తి, బమ్మెర, వల్మిడి పర్యాటకాభివృద్ధిలో భాగంగా రూ.5 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. దాత వేల్పుల గణేష్‌ రూ.3.20 లక్షలతో శ్రీరామ గుండంపై నాగవెల్లి వేదిక, మారపల్లి అంజయ్య కుమారులు రూ.8 లక్షల స్వాగత తోరణాన్ని నిర్మించేలా చేయూతనందించారు. నేడు రామనవమిని పురస్కరించుకుని గుట్టపై సీతారామచంద్రస్వామి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే ఈసారి భక్తులకు మాత్రం అనుమతి లేదు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని