Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కొవిడ్‌పై నిర్లక్ష్యం వద్దు: శ్రీహర్షిణి


మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి

మహదేవ్‌పూర్‌, న్యూస్‌టుడే: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వ్యవహరించాలని, నిర్లక్ష్యం ప్రదర్శించొద్దని జడ్పీ ఛైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి పేర్కొన్నారు. మహదేవపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో కరోనాపై నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ ప్రాంతంలో కరోనా కేసుల తీవ్రత ఎలా ఉందో అధికారులతో మాట్లాడారు. గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉందని, టీకా తీసుకుంటున్న వారి సంఖ్యను పెంచాలని సూచించారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ముందుకు సాగాలని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వాక్సినేషన్‌ కార్యక్రమంను పరిశీలించారు. ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శోభారాణి, ఎంపీపీ రాణిబాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, సర్పంచి శ్రీపతిబాపు, కాటారం మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ ఆన్కారీ భవాని, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ చల్ల తిరుపతి, ఇన్‌చార్జ్‌ ఎంపీడీవో శంకర్‌నాయక్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని