Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సమన్వయంతో ఎన్నికల నిర్వహణ

సీపీ డాక్టర్‌ తరుణ్‌జోషి


పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్న సీపీ తరుణ్‌ జోషి, డీసీపీలు వెంకటలక్ష్మి, పుష్ప

వరంగల్‌క్రైం, న్యూస్‌టుడే: నగరపాలక సంస్థ ఎన్నికల నిర్వహణలో పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌జోషి అన్నారు. ఈనెల 30న పోలింగ్‌ జరిగే ఠాణాల పరిధిలోని పోలీసు అధికారులతో వీడియో కాన్పరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికల ముందు, తర్వాత పోలీసు అధికారులు తీసుకోవాల్సిన చర్యలు ఇతర విషయాలను అధికారులకు వివరించారు. సలహాలు, సూచనలు చేశారు. సీపీ తరుణ్‌జోషి మాట్లాడుతూ.. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుకూలమైన వాతావారణం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల నియమావళిని అతిక్రమించకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎవరైనా ఉల్లంఘిస్తే కేసులను నమోదు చేయాలని ఆదేశించారు. గతంలో ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి నిఘా ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ను పెంచాలన్నారు. తనిఖీలు నిర్వహించే సమయంలో తప్పనిసరిగా వీడియో తీయాలన్నారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నిబంధనలను పాటిస్తూ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని కోరారు. అంతకుముందు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్‌ సీతారాంరెడ్డి, వేణుఆనంద్‌ ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతర అంశాలపై అతిథి ఉపన్యాసం చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎలాంటి సెక్షన్ల కింద కేసులను నమోదు చేయాలనే వాటిపై అధికారులు, సిబ్బందికి వివరించారు. ఈ సమావేశంలో స్పెషల్‌బ్రాంచ్‌ అదనపు డీసీపీ జనార్దన్‌, ఎస్‌బీ, ఐటీ, సీసీఆర్‌బీ, కమ్యూనికేషన్‌ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని