Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రం మంజూరు


జిల్లా ఆసుపత్రిని వైద్యులతో కలిసి పరిశీలిస్తున్న కలెక్టర్‌ గౌతమ్‌ 

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: కరోనా పాజిటివ్‌ కేసులను వేగంగా నిర్ధారించేందుకు జిల్లా కేంద్రానికి ఆర్‌టీపీసీఆర్‌ పరీక్ష కేంద్రం మంజూరైందని కలెక్టర్‌ గౌతమ్‌ తెలిపారు. మంగళవారం జిల్లా ఆసుపత్రిని సందర్శించి ఆర్‌టీపీసీఆర్‌ ప్రయోగశాల ఏర్పాటుకు అవసరమైన భవనాన్ని పరిశీలించారు. వెంటనే టెండర్లు నిర్వహించి పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఇప్పటివరకు జిల్లాలోని ఆసుపత్రుల్లో ర్యాపిడ్‌ పరీక్షలను మాత్రమే చేస్తున్నారని.. ఆర్‌టీపీసీఆర్‌ను వరంగల్‌కు పంపించి ఫలితాలు వచ్చేసరికి జాప్యం జరుగుతోందన్నారు. ప్రయోగశాల ఇక్కడే ఏర్పాటయితే త్వరగా ఫలితాలు అందుతాయన్నారు. జిల్లా వైద్యశాఖాధికారి డి.శ్రీరాం, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెంకట్రాములు, ఆర్‌ఎంవో రమేశ్‌, జిల్లా ఉపవైద్యశాఖాధికారి అంబరీషా పాల్గొన్నారు.

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: పురపాలక సంఘాల్లో ఆదాయ వనరులు పెంచుకోవడం ద్వారా అభివృద్ధి సాధించవచ్చని కలెక్టర్‌ గౌతమ్‌ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి పురపాలక శాఖ అధికారులతో దూరదృశ్య సమావేశం నిర్వఇఇంచారు. టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో చేపట్టిన పనుల పూర్తి, టీఎస్‌బీపాస్‌ ద్వారా అనుమతుల సంఖ్యను పెంచాలన్నారు. కమిషనర్లు ఇళ్ల నిర్మాణాలను తనిఖీలు చేయాలన్నారు. అదనపు కలెక్టర్‌ అభిలాషా అభినవ్‌, పురపాలక ఈఈ రంజిత్‌ పాల్గొన్నారు.

పాజిటివ్‌ వ్యక్తులు బయట తిరిగితే కేసులు..

మహబూబాబాద్‌, న్యూస్‌టుడే: కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులపై నిఘా ఉంచాలని.. వారు బయట తిరిగితే కేసులు నమోదు చేయాలని కలెక్టర్‌ గౌతమ్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో కొవిడ్‌ నియంత్రణపై అధికారులతో సమావేశమయ్యారు. ర్యాపిడ్‌ పరీక్షల్లో నెగటివ్‌ వచ్చినా లక్షణాలు కనిపిస్తే ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి కేసు వివరాలను రిజిస్టర్‌లో నమోదు చేయాలన్నారు. జడ్పీ సీఈవో అప్పారావు, డీఆర్‌డీవో సన్యాసయ్య, కొవిడ్‌ జిల్లా నోడల్‌ అధికారి రాజేశ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని