Published : 21/04/2021 02:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

దారి దోపిడీ ముఠా అరెస్టు


నిందితులను చూపిస్తున్న ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రావు

హసన్‌పర్తి, న్యూస్‌టుడే: వరంగల్‌అర్బన్‌ జిల్లా హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని రహదారిపై రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళ్లే వారిపై కత్తితో దాడి చేస్తూ నగదు, చరవాణులను దోపిడీ చేస్తున్న ముఠా సభ్యులను హసన్‌పర్తి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుస్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ కరివేద శ్రీధర్‌రావు వివరాలు వెల్లడించారు. ఈ నెల 12న నిందితులు ఒక వ్యక్తిని కత్తితో గాయపరిచి రూ.4 వేలు లాక్కున్నారు. మరో వ్యక్తిని కొట్టి రూ.600 తీసుకున్నారు. వీటిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నలుగురు వ్యక్తులు రెండు ద్విచక్రవాహనాలపై తిరుగుతూ దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. ఇన్‌స్పెక్టర్‌ శ్రీధర్‌రావు సిబ్బందితో కలిసి మంగళవారం వంగపహాడ్‌ మార్గంలోని రైస్‌ మిల్లు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా నిందితులను పట్టుకొని ప్రశ్నించడంతో నేరాలు చేసినట్లు అంగీకరించారు. వారిలో ఉర్సు కరీమాబాద్‌కు చెందిన కందుల సాయితేజ, ఎండీ ఫిరోజ్‌, బీరన్నకుంటకు చెందిన షేక్‌గఫూర్‌, ఉర్సుగుట్టకు చెందిన షేక్‌ రఫీక్‌ ఉన్నారు. వారి నుంచి రెండు ద్విచక్రవాహనాలు, రూ.4 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబర్చిన ఎస్సై కె.జితేందర్‌రెడ్డి, సిబ్బంది వి.క్రాంతికుమార్‌, మధు, అబ్దుల్లాలను ఇన్‌స్పెక్టర్‌ అభినందించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని