Ts News: భూతగాదాలకు తండ్రి, కొడుకులు బలి
logo
Updated : 19/06/2021 17:08 IST

Ts News: భూతగాదాలకు తండ్రి, కొడుకులు బలి

కాటారం: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండల పరిధిలోని గంగారంలో దారుణం చోటుచేసుకుంది. భూతగాదాలకు ముగ్గురు బలయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ఇద్దరు కుమారులను ప్రత్యర్థులు అతి దారుణంగా నరికి చంపేశారు. పొలం హద్దుల విషయంలో గత కొంత కాలంగా రెండు కుటుంబాల మధ్య గొడవ జరుగుతోంది. దీనికి సంబంధించి మరోసారి మాట్లాడుకునేందుకు పొలం వద్ద రెండు కుటుంబాల వారు సమావేశం అయ్యారు. మాటామాటా పెరిగి గొడవ తారస్థాయికి చేరడంతో.. మంజా నాయక్, ఆయన కుమారులు సారయ్య, భాస్కర్‌లను ప్రత్యర్థులు గొడ్డలితో దాడి చేశారు. వారు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని