close

శనివారం, ఫిబ్రవరి 22, 2020

తాజా వార్తలు

పలు రైళ్లు రద్దు

భీమవరం అర్బన్‌, నరసాపురం, ఆకివీడు గ్రామీణ, న్యూస్‌టుడే: భీమవరం మీదుగా తిరిగే పలు రైళ్లు తాత్కాలికంగా రద్దయినట్లు టౌన్‌స్టేషన్‌ పర్యవేక్షకుడు దేవకుమార్‌ ఆదివారం తెలిపారు. రైల్వేలైను డబ్లింగ్‌- విద్యుద్దీకరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు కొన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

రద్దైన రైళ్ల వివరాలు

విజయవాడ నుంచి నరసాపురం వెళ్లే 77201 రైలు, నరసాపురం నుంచి విజయవాడ వెళ్లే 77202 రైలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు రద్దయ్యాయి. నరసాపురం నుంచి భీమవరం మీదుగా గుంటూరు వెళ్లే 77295 రైలు, మాచర్ల నుంచి భీమవరం తిరిగే 77298 రైలు, విజయవాడ - భీమవరం మధ్య తిరిగే 77231 రైలు జనవరి 27 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఆకివీడు నుంచి విజయవాడ వైపు తిరుగుతాయి. భీమవరం నుంచి విజయవాడ వెళ్లే 77206 రైలు, విజయవాడ నుంచి నరసాపురం వెళ్లే 77263 రైలు ఫిబ్రవరి ఒకటి నుంచి 3వ తేదీ వరకు రద్దయ్యాయి. నరసాపురం నుంచి విజయవాడ తిరిగే 77204 రైలు ప్రతి రోజూ భీమవరంలో మధ్యాహ్నం 14.55కి బయలుదేరుతుంది. ఇక నుంచి ఈ రైలు 15.55 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.