
కోడి పందేలుఅడ్డుకున్న అధికారులు
దెందులూరు: దెందులూరు మండలం పోతునూరులో కోడి పందేల నిర్వహణను పోలీసులు, రెవెన్యూ అధికారులు మంగళవారం అడ్డుకున్నారు. స్థానిక ఉన్నత పాఠశాల సమీపంలో కోడిపందేలు నిర్వహణ కోసం ఇనుప కంచె వేస్తుండగా సమాచారం తెలుసుకున్న తహసీల్దారు శేషగిరి, ఎస్ఐ రామ్‌కుమార్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. సంఘటనా స్థలంలో పెన్సింగ్లను ధ్వంసం చేశారు. పెన్సింగ్ ఏర్పాట్లు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దారు ఆదేశించారు.
Tags :