
ఎకరం ఎండినా సహించను: కలెక్టర్
ఏలూరు కలెక్టరేట్, న్యూస్టుడే: జిల్లాలో సాగునీటి ఎద్దడి కారణంగా ఒక్క ఎకరం పంట ఎండినా సహించనని కలెక్టర్ ముత్యాలరాజు అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగునీరు అందక ఎక్కడైనా పంట ఎండిపోతే సంబంధిత అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. అనుమతి లేకుండా ఎవరూ పంటలు వేయకుండా చూడాలని అధికారులను ఆదేశించినా కొన్నిచోట్ల పంటలు వేసినట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అటువంటి వారికి తాఖీదు ఇచ్చారా? లేదా? అని ప్రశ్నించారు. జిల్లాలో ఏ రైతు ఎన్ని ఎకరాల్లో పంట వేశారో తనకు నివేదికలు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్ అధికారులు, పోలింగ్ అధికారులకు కలెక్టర్ విడిది కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పలు సూచనలు చేశారు.