Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

నకిలీ మందులు విక్రయిస్తే చర్యలు: మంత్రి

ఏలూరు టూటౌన్‌, న్యూస్‌టుడే: నకిలీ మందులు విక్రయిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మందుల విక్రయాలు నిరోధించేందుకు తనిఖీలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించామన్నారు. స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాత్రి ఆయన మాట్లాడుతూ నకిలీ మందుల వ్యవహారం ఇటీవల భీమవరంలో బయటపడటంతో తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని పాలకొల్లుకు చెందిన లోకేశ్వరి మెడికల్‌ ఏజెన్సీని మూయించామన్నారు. నకిలీ మందులు ఎక్కడైనా విక్రయిస్తున్నట్లు తెలిస్తే 0863 2330909, 2339246 నంబర్లకు ఫిర్యాదు చేయాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. నకిలీ మందుల రాకెట్‌ను ఛేదించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని డ్రగ్స్‌ శాఖ ఐజీ రవిశంకర్‌ నారాయణ్‌ను మంత్రి ఆదేశించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని