Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోదావరిపై రాకపోకలకు ఏర్పాట్లు

 


శివరాత్రి ఏర్పాట్లపై మాట్లాడుతున్న దెందులూరు, నూజివీడు ఎమ్మెల్యేలు

అబ్బయ్యచౌదరి, వెంకట ప్రతాప్‌ అప్పారావు

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదిపై భక్తుల రాకపోకలకు వీలుగా ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఈ నెల 10 నుంచి మూడు రోజులపాటు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వచ్చే లక్షలాది మంది భక్తులు నదిని దాటేందుకు వీలుగా కొంతమేర ఇసుక బస్తా లు.. మరికొంత భాగం పంటులు ఏర్పాటు చేసేలా భక్తులు కాలినడకన వెళ్లేందుకు వీలుగా బాదులు నీటిలో పాతి.. వాటికి తడికెలు కట్టి మధ్యలో ఇసుక బస్తాలు వేసే పనులను నాలుగు రోజులుగా కూలీలు చేస్తున్నారు.

బలివే వద్ద పరిశీలన

పెదవేగి, న్యూస్‌టుడే: ఈ నెల 11న బలివే తిరునాళ్లను ఘనంగా నిర్వహించేందుకు సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు దెందులూరు, నూజివీడు ఎమ్మెల్యేలు కొఠారు అబ్బయ్యచౌదరి, మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు తెలిపారు. కృష్ణా జిల్లా ముసునూరు మండలం బలివేలో మంగళవారం రామలింగేశ్వరరావుస్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

పట్టిసీమ వద్ద నదిలో కర్రలు పాతుతున్న కూలీలు


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని