Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కుక్కర్‌ పేలి చిన్నారులకు గాయాలు


చికిత్స పొందుతున్న సనంద

జంగారెడ్డిగూడెం, న్యూస్‌టుడే: జంగారెడ్డిగూడెం మండ లం మంగిశెట్టిగూడెం అంగన్‌ వాడీ కేంద్రంలో మంగళవారం కుక్కర్‌ పేలి ఉడుకుతున్న పప్పు పడటంతో పలువురు చిన్నారులకు గాయాలయ్యాయి. పప్పు ఉడుకుతుండగా కుక్కర్‌ పేలి పప్పు ఎగజిమ్మింది. అదే గదిలో ఆడుకుంటున్న చిన్నారులపై పడటంతో బొబ్బలు లేచి చర్మం ఊడి పోయింది. ఈ ఘటనలో గండ్రోతు సనంద, పిల్లంటి రిశ్వంత్‌లు తీవ్రంగా గాయపడగా.. మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి. తల్లిదండ్రులు చిన్నారులకు తాడువాయి ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం జంగారెడ్డిగూడెంలోని ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని ఒకే గదిలో నిర్వహిస్తున్నారని వంటతో పాటు ప్రీ స్కూల్‌ను అక్కడే నడుపుతున్నారని బాధిత చిన్నారుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కర్‌ పేలే వరకు పట్టించుకోకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని