Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సకాలంలో వాతావరణ సమాచారం

తాడేపల్లిగూడెం అర్బన్‌, న్యూస్‌టుడే: స్వయంచలిత వాతావరణ కేంద్రం(ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌) ద్వారా రైతులకు సకాలంలో ఉష్ణోగ్రతలు, వాతావరణంలోని మార్పులను ఐదు రోజుల ముందుగానే తెలియజేయవచ్చని ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్‌ టి.జానకిరామ్‌ తెలిపారు. వెంకట్రామన్నగూడెంలోని వై.ఎస్‌.ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ఆటోమేటిక్‌ వెదర్‌ స్టేషన్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ శాఖ సమన్వయంతో వ్యవసాయ పరిశోధనా మండలి ఆర్థిక సహకారంతో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ వాతావరణ కేంద్రం ఇచ్చే సమాచారం సమీప ప్రాంతాల్లోని రైతులకు, ఉద్యాన కోర్సు విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. విస్తరణ సంచాలకులు డాక్టర్‌ బి.శ్రీనివాసులు, కేవీకే ప్రధాన శాస్త్రవేత్త ఇ.కరుణశ్రీ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని