Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కానిస్టేబుల్‌ ఆత్మహత్యాయత్నం

వేలేరుపాడు, న్యూస్‌టుడే: వేలేరుపాడు పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కె.నాగేంద్రకుమార్‌ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. కానిస్టేబుల్‌ నాగేంద్రకుమార్‌ పోలీసు వసతిగృహంలో మధ్యాహ్నం నిద్రపోయారు. సాయంత్రమైనా నిద్ర లేవకపోవడంతో అనుమానం వచ్చి చూడగా పురుగుల మందు తాగినట్లు గుర్తించారు. హుటాహుటిన వేలేరుపాడు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెం ప్రాంతీయ వైద్యశాలకు 108 వాహనంలో తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని