Published : 03/03/2021 05:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కాలువల్లో అవరోధాల తొలగింపు

ఆకివీడు, న్యూస్‌టుడే: ఆకివీడు మండలం పరిధిలో మేజర్‌ కాలువలైన వెంకయ్య వయ్యేరు, పాత వయ్యేరుల్లో సాగునీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్న తూడు, గుర్రపుడెక్క తొలగింపు పనులను అధికారులు చేపట్టారు. వీటివల్ల శివారు ప్రాంతాల్లో పెరుగుతున్న సాగునీటి కష్టాలపై ఈ నెల ఒకటిన ‘వంతులోనూ అదే తంతు’ శీర్షికన ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. వంతు సమయంలో నీటి మట్టాన్ని పెంచి శివారు ప్రాంతాలకు జలాలు అందేలా చర్యలు తీసుకున్నామని డీఈ వెంకటేశ్వరరావు చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని